మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘ఎవడు’. సంక్రాంతి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఓవర్సీస్ లో కూడా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ‘ఎవడు’ కి యుఎస్ మొత్తం ప్రీమియర్ షోస్ ఉన్నాయి. ఈ ప్రీమియర్ షోకి సంబందించిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. పెద్దవారికి అయితే టికెట్ ధర 16 డాలర్లు, అదే పిల్లలకి అయితే 9 డాలర్లు. మరింకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని థియేటర్స్ లో టికెట్స్ బుక్ చేసుకోండి.
శృతి హాసన్, అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ అగర్వాల్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.