విజయ నిర్మల గారి లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ని స్పూర్తిగా తీసుకొని చిన్న హీరోతో సినిమాలు చేసి హిట్ కొట్టడం ఆనవాయితీగా మార్చుకున్న లేడీ డైరెక్టర్ బి.జయ. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. చెన్నై యూనివర్సిటీలో జర్నలిజంలో డిప్లమో పూర్తి చేసిన ఆమె ఆంధ్రజ్యోతి పత్రికలో కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తరవాత పలు పత్రికల్లో పనిచేసింది.
చివరికి సినిమా అంటే ఉన్న ఆసక్తి కారణం చేత 2003లో ‘చంటిగాడు’ సినిమాతో దర్శకురాలిగా తెలుగు చిత్ర సీమకి పరిచయమైంది. మొదటి సినిమాలో స్టార్ నటీనటులు ఎవరూ లేరు, కానీ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆ సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ 5 సినిమాలు చేసిన బి. జయ చివరిగా చేసిన సినిమా ‘లవ్లీ’. ఆది, శాన్వి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే బి. జయ స్టార్ట్ పి.ఆర్.ఓ అయిన బిఏ రాజు గారి సతీమణి.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆమెకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..