1 సినిమాకు 20నిముషాలు కత్తెర

1_Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైంది. ఈ సినిమా నిడివిపై చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సినిమా ప్రియుల సమీక్షల మేరకు ఈ చిత్ర నిడివిలో 20నిముషాలను కత్తిరించనున్నారు

ఈ వార్తను సినిమా నిర్మాతలలో ఒకరైన అనీల్ సుంకర తెలిపారు “ప్రేక్షకుల స్పందనను చూశాక ఈ సినిమాలో 20నిముషాలను కత్తిరించనున్నాం. కొత్త వర్షన్ ను థియేటర్ లలో రేపటినుంచి చూడచ్చు” అని తెలిపారు

సినిమాను కత్తిరిస్తే నిజంగానే సహాయపడచ్చు. సుకుమార్ ఈ సినిమాకు దర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాత.దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. కృతి సనన్ హీరోయిన్. భారీ బడ్జెట్ తో ఈ సినిమా దాదాపు రెండేళ్ల పాటు తెరకెక్కింది

Exit mobile version