చిటపట చినుకులు వెనకున్న ఆసలు కథ.!

naga
పాట పాతదే అయినా, ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ అనే పాటకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అల్ టైం తెలుగు మూవీ సాంగ్స్ లో ఇది కూడా ఒకటి. ఈ పాత ఎఎన్ఆర్, సరోజ దేవి నటించిన ‘ఆత్మ బలం’ సినిమా లోనిది. నేటితో ఈ సినిమా విడుదలై 50 సంవత్సరాలు పూర్తి కావడంతో చాలా పత్రికల్లో ఈ సినిమాపై ఓ స్పెషల్ ఫీచర్ చేసారు.

ఇందులో ఈ పాటకి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఈ పాటకోసం డైరెక్టర్ వి. మధుసూదనరావు, నిర్మాత బివి రాజేంద్ర ప్రసాద్, పాటల రచయిత ఆత్రేయ కలిసి బెంగుళూరు బృందావన్ హోటల్ లో చర్చిస్తున్నారు. ఆత్రేయ గారు ఎంత ప్రయత్నించినా సరైన పాట మాత్రం రావడం లేదు.

దాంతో ఆత్రేయ గారు ఉదయాన్నే లేచి కుబ్బన్ పార్క్ కి వెళ్ళారు. ఆ పార్క్ లో కూర్చొని ఆలోచిస్తున్న ఆయన ఆలోచనల్ని వాన చినుకులు ఆటంకం కలిగించాయి అందరూ వానలో తడవకుండా ఉండటానికి అటు ఇటు పరిగెడుతున్నారు. కానీ వారిలో యూత్ కపుల్ ఆత్రేయ గారిని ఆకర్షించారు. అందరూ పరిగెడుతుంటే వారు మాత్రం ఆ వాన చినుకుల్లో రొమాన్స్ చేసుకుంటున్నారు. దాంతో ఒక్కసారిగా ఆత్రేయ గారి మైండ్ లో ఆలోచన ఆ ఆలోచనలో నుంచి పుట్టిన పాటే ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’.

Exit mobile version