చిరంజీవి ఠాగూర్ సినిమాను బాలీవుడ్ లో గబ్బర్ గా తెరకెక్కిస్తూ హిందీ పరిశ్రమలోకి జాగర్లమూడి రాధాకృష్ణ అడుగుపెట్టనున్నాడు చిరంజీవి పాత్రను అక్షయ్ కపూర్ పోషించనున్నాడు. శృతిహాసన్, కరీనా కపూర్ హీరోయిన్స్
తన విధ్యార్ధులతో కలిసి లంచం తీసుకుంటున్న వాళ్ళని మట్టికరిపిస్తూ వుండే ఉపాధ్యాయపాత్రలో హీరో కనిపిస్తాడు. ఈ పాత్రకోసం చాలా రోజులుగా అక్షయ్ కష్టపడుతున్నాడు. క్రిష్ కి ఇది పెద్ద ప్రొజెక్ట్. ఇప్పటివరకూ క్రిష్ ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణంవందే జగద్గురుం’ సినిమాలు తీశాడు. స్టార్ల విషయం, బడ్జెట్ విషయం లెక్కిస్తే క్రిష్ కు ఇదే పెద్ద ప్రొజెక్ట్ కానుంది
ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలి మరియు 18మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సమాచారం ప్రకారం ఈ సినిమా 2014 చివర్లో విడుదలకానుంది