విడుదలైన వీరుడొక్కడే టీజర్

Veerudokkade_New_Stills-4
అజిత్ నటించిన వీరమ్ తెలుగు వర్షన్ వీరుడొక్కడే టీజర్ ను ఎట్టకేలకు హైదరాబాద్ లో విడుదలచేశారు. బి.ఏ రాజు, బి జయా, శ్రీను బాబు ఈ వేడుకకు హాజరయ్యారు. దర్శకుడు శివ ఈ సినిమాను పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తీశాడు. ఈ యేడాదిలో విడుదలకానున్న తమిళ సినిమాలలో ఇది భారీ క్రేజ్ వున్న సినిమా. తమిళంలో ఈ సినిమా జనవరి 10న విడుదలకానుంది

ఈ సినిమా తెలుగు వర్షన్ ను నిర్మిస్తున్న శ్రీనుబాబు మాట్లాడుతూ “అజిత్ ప్రాజెక్ట్ లో పనిచెయ్యడం మాకు ఆనందం. ఆయన నటించిన ఆట ఆరంభం ఇక్కడ బాగా ఆడింది. ఈ సినిమాకూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. ఈ సినిమాను జనవరి చివరివారంలో విడుదలచెయ్యనున్నాం” అని తెలిపారు

దేవిశ్రీప్రసాద్ అందించిన ఆడియో ఈ నెల 18న ఇక్కడ విడుదలకానుంది. అజిత్ సరసన తమన్నా తొలిసారిగా జతకట్టింది

Exit mobile version