లహరి మ్యూజిక్ ద్వారా అల్లు అర్జున్ మూవీ ఆడియో

Race-Gurram
గతంలో ఆడియో కంపెనీలలో ముందజలో ఉన్న లహరి ఆడియో కంపెనీ ఈ మధ్య కాలంలో కాస్త వెనకబడింది. వారు తాజాగా మళ్ళీ రంగంలోకి దిగి తమ కంపెనీ ద్వారా వరుసగా ఆడియోని ప్రజలకు అందించడానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కమ్ బ్యాక్ మూవీ గా మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమా రైట్స్ ని సొంతం చేసుకొంది. ఈ సినిమాతో మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చిన లహరి మ్యూజిక్ వారు వరుసగా టాప్ హీరోల సినిమాలపై కన్నేశారు.

‘1-నేనొక్కడినే’ సినిమా తర్వాత వాళ్ళు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రేసు గుర్రం’ ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం లహరి మ్యూజిక్ వారు పలు టాప్ హీరోల సినిమాల ఆడియో రైట్స్ విషయంలో ఇతర కంపెనీలతో బాగా పోటీ పడుతున్నారు.

Exit mobile version