కాజల్ చేతినిండా ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీగావుంది. ఇటీవలే రామ్ చరణ్ సరసన కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ను అంగీకరించిన ఆమె తమిళంలో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒక దాంట్లో ధనుష్ హీరో
సమాచారం ప్రకారం ఈ సినిమా 2014 మధ్యనుండి ప్రారంభంకానుంది. ప్రస్తుతం ధనుష్ కె.వి ఆనంద్ దర్శకత్వంలో ‘అనెగన్’ మరియు పలు హిందీ సినిమాలతో బిజీగా వున్నాడు. పుకార్ల ప్రకారం 2012లో సినిమా రంగానికి పరిచయమైనా ఒక యువ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. కాజల్, ధనుష్ లు జంటగా నటించడం ఇదే తొలిసారి. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. ఈ సినిమానే కాక కాజల్ ఉదయనిది స్టాలిన్ సరసన ఒక ప్రాజెక్ట్ మరియు కొన్ని తెలుగు సినిమాల కధలు వినే పనిలో వుంది