శిష్యుడికి సంతాపం తెలియజేసిన దాసరి

Dasari-Narayana-Rao
విలక్షణ దర్శకుడు దర్శకకరత్న దాసరి నారాయణరావు ఉదయ్ కిరణ్ అకాల మరణం విషయంలో సంతాపాన్ని తెలియజేసాడు. ఈ యంగ్ హీరో దాసరి గారికి బాగా దగ్గరగా ఉండేవాడు. అలాగే ఆయన్ని తన గురువుగా భావించేవాడు. ఈ సంఘటన విన్న తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసారు.

రేపు ఉదయం ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఉంచనున్నారు. తన అభిమానులు, తన ఆప్తులు, ఇండస్ట్రీలోని మిత్రులు తనని కడసారి చివరి చూపు చూసుకోవాలని అక్కడ ఉంచనున్నారు. ఆ తర్వాత ఎర్రగడ్డలో అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ ఆత్మహత్యని పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ విషయం పై విచారణ జరుపుతున్నారు.

Exit mobile version