సుమంత్ హీరోగా నటించిన ‘ఏమో గుర్రంఎగరావచ్చు’ సినిమా విడుదల తేది ఖరారు అయ్యింది. ఈ సినిమా ఈ నెల 24న మనముందుకు రానుంది. ఈ వార్తను అధికారికంగా సినిమా బృందం వెల్లడించారు
‘ఏమో గుర్రంఎగరావచ్చు’ కమర్షియల్ హంగులతో కూడిన కుటుంబ కధా చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాలో సుమంత్ సరసన థాయ్ నటి పింకీ సావిక నటించింది. కీరవాణి సంగీత దర్శకుడు. చిత్రంలో కొంతభాగం బ్యాంకాక్ లో చిత్రీకరించారు
ఈ సినిమాకు చంద్ర సిద్ధార్ధ్ దర్శకుడు. కాంచి స్క్రిప్ట్ ను అందించాడు. పూదోట సుధీర్ నిర్మాత. ఈ ప్రాజెక్ట్ ఫలితంపై సుమంత్ ఆసక్తిగా వున్నాడు