మలయాళ సినిమాలో నటించనున్న నిత్యామీనన్

Nithya-Menen
దాదాపు యేడాది తరువాత నిత్యామీనన్ మలయాళ చిత్రసీమలో తిరిగి అడుగుపెట్టనుంది. 3 జాతీయ అవార్డులు గెలుచుకున్న ‘ఉస్తాద్ హోటల్’ ఆమె ఆఖరి హిట్ సినిమా కాగా చివరిగా ‘పొప్పీన్స్’లో కనిపించింది

సమాచారం ప్రకారం నిత్యా అంజలీ మీనన్ సినిమాలో నటించనుంది. విశేషం ఏమిటంటే ‘ఉస్తాద్ హోటల్’ కు కధను అంజలీ మీనన్ ఏ అందించారు. ఈ సినిమాలో నిత్యా తో పాటూ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో నితిన్ సరసన నటించిన ఇషా తల్వార్ కూడా నటించనుంది. డుల్కర్ సల్మాన్, ఫాసిల్, పార్వతి నాయర్ మొదలగు తారాగణం ఈ సినిమాకు పనిచెయ్యనున్నారు

శ్రీప్రియా తీసిన ‘మాలిని 22’ సినిమాతో నిత్యా త్వరలో మనముందుకు రానుంది. ఈ సినిమానే కాక ఆమె ‘ఏమిటో ఈ మాయ’, ‘రుద్రమదేవి 3డి’లలో నటిస్తుంది

Exit mobile version