400మందితో షూటింగ్ చేస్తున్న వర్మ

mohan-babu-rgv-vishnu1
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, మంచు విష్ణు హీరోలుగా విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ప్రియా డైరీ వద్ద జరుగుతోంది. అక్కడ 400 మంది జూనియర్ ఆర్టిస్టులతో ప్రముఖ తారాగణంపై వర్మ కొన్ని కీలకమైన సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ వచ్చే నెల 11 వరకు జరగనుంది.

వర్మ మంచు ఫ్యామిలీ తో చేస్తున్న ఈ సినిమా పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు, ప్రముఖ నటీనటులను ఇంకా తెలియజేయలేదు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ హీరోస్ ఈ సినిమా కాకుండా ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version