అల్లరోడి సినిమా కోసం హోటల్ సీన్స్ షూట్ చేస్తున్న టీం

Allari-Naresh
కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన రాబోయే సినిమా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ఇ. సత్తిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఒక పల్లెటూరిలో ఉండే హోటల్ లో జరిగే సీన్స్ ని అల్లరి నరేష్ మరియు మిగిలిన తారాగణం పై షూట్ చేస్తున్నారు. ఇషా చావ్లా – స్వాతి దీక్షిత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ ని అంబికా కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో విజయం సాధించిన ‘కలకలప్పు’ సినిమాకి రీమేక్. విజయ్ఎబెంజెర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నారు.

Exit mobile version