అజిత్ స్క్రీన్ ప్రజెన్స్ అమోఘం : తమన్నా

tamanna
రెండేళ్ల విరామంతరువాత తమన్నా తమిళ సినిమా తెరపై కనిపించనుంది. 2011లో వెంఘై సినిమా తరువాత ఈ భామ తెలుగు, హింది సినిమాలపై దుష్టిపెట్టింది. ఇప్పుడు తమన్నా అజిత్ సరసన ‘వీరమ్’లో నటిస్తుంది. ఈ సినిమాకు తెలుగులో ‘శౌర్యం’ సినిమాను తీసిన శివ దర్శకుడు. తెలుగులో ఈ చిత్రం ‘వీరుడొక్కడే’గా తెలుగులో విడుదలకానుంది.

ఈ సినిమా గురించిన విశేషాలను మాట్లాడుతూ “ఈ సినిమా నా కెరీర్ లోనే పెద్ధ సినిమా. అజిత్ తో నటించడం ఎప్పటికీ ఆనందమే. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అధ్బుతం. ఈ యేడు ఈ సినిమా నాకు కెరీర్ మొత్తం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇవ్వనుంది” అని తెలిపింది

ఈ యేడాది తమన్నా ‘ఆగడు’, ‘బాభూబలి’ సినిమాలలో బిజీగా వుండనుంది. ఇవేకాక రెండు హిందీ సినిమాలను సైతం అంగీకరించింది. ఏదిఏమైనా తమన్నాకు 2014 కెరీర్ లోనే భారీ యేడాది కానుంది.

Exit mobile version