వంశీ 25 వ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్

Tanu-Monne-Vellipoind
డైరెక్టర్ వంశీ కెరీర్ లో ఎన్నో మరచిపోలేని సినిమాలు వున్నాయి. ప్రస్తుతం ఆయన తీసిన 25 వ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా టైటిల్ ‘తను మొన్నే వెళ్లిపోయింది’. ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఈ సినిమాకి సెన్సార్ వారు క్లీన్ యూ సర్టిఫికేట్ జారిచేశారు. ఈ సినిమాపై ఎటువంటి అనుమానాలు, డిస్కషన్ చేయకుండా సెన్సార్ వారు యూ సర్టిఫికేట్ జారీచేయడం జరిగింది. ఈ సినిమాలో అజ్మల్ (రంగం ఫేం), హీరోగా, నికిత నారాయణ్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. వంశీ ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదించాలని ఆశిద్దాం

Exit mobile version