అభిమానుల మధ్య విడుదల చేయనున్న ‘ఎవడు’ ట్రైలర్

ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రేపు సాయంత్రం విడుదల చేయనున్నారు. మెగా అబిమానుల, సిని ప్రేమికుల కోసం ఈ ట్రైలర్ ని ఆర్ టి సి క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఒక యంగ్ స్టార్ విడుదల చేయనున్నాడు. ‘ఎవడు’ సినిమాని జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా ఒక కొత్త స్టోరీ లైన్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని సమాచారం. అల్లు అర్జున్, కాజల్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా సంక్రాంతి సీజన్ విడుదలవుతుండడంతో రామ్ చరణ్ ఈ సినిమా మంచి విజయం సాదిస్తుందని ఆశిస్తున్నాడు.

Exit mobile version