ప్రస్తుతం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ లో పునీత్ రాజ్ కుమార్ ఒకడు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన పునీత్ రాజ్ కుమార్ ఒక్కడు రీమేక్ ల్లో నటించాడు. ప్రస్తుతం మహేష్ బాబు దూకుడు సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే మహేష్ బాబు – పునీత్ రాజ్ కుమార్ లు మంచి స్నేహితులు.
మహేష్ బాబు పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ ‘ పోకిరి సినిమా టైం నుంచి నాకు పునీత్ తెలుసు. నేను పునీత్, అతని ఫ్యామిలీని బెంగుళూరులో కలిసాను. అతని వినయ విధేయతలు చూసి షాక్ అయ్యాను. అతను లెజెండ్ నటుడు డా. రాజ్ కుమార్ కొడుకు అయినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంతో ఒదిగి ఉంటారు. అతన్ని కలిసి నప్పుడు అతని నుండి చాలా నేర్చుకున్నాను. అతని రాబోయే మూవీ నిన్నిన్దలే సినిమాకి ఆల్ ది బెస్ట్ అని’ అన్నాడు.
నిన్నిన్దలే సినిమాకి జయంత్ సి పరాన్జీ డైరెక్టర్, జయంత్ కి ఇది తొలి కన్నడ మూవీ. పునీత్ రాజ్ కుమార్ – ఎరికా ఫెర్నాండెజ్ జంటగా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు.