నాని హీరోగా నటిస్తున్న ‘జెండపై కపిరాజు’ సినిమా 2014లో మనముందుకురానుంది. ఈరోజు హైదరాబాద్లో ఈ సినిమా ఆడియో విడుదలవేడుక జరగనుంది. సముద్రఖని దర్శకుడు. అమలాపాల్ హీరోయిన్. రాగిణి ద్వివేది ముఖ్యపాత్రపోషిస్తుంది
ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఏమిటంటే ఈ చిత్రం తమిళ వర్షన్ ‘నిమిరింతు నిల్’ ని 2014 ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. ఈ మాతృకలో జయం రవి, అమలాపాల్ నటించారు. ఈ వేడుకలో సినిమా ప్రదర్శన ఏ విభాగానికి చెందినదో ఇంకా స్పష్టత లేదు. ఏదిఏమైనా ప్రపంచంలోనే ప్రముఖ చలనచిత్రోత్సవం లో ప్రదర్శితం కావడం నిజంగా మంచి విషయమే. ఈరోజు జరిగే ఆడియో వేడుకలో అధికారిక ప్రకటన ఇచ్చే సూచనలు వున్నాయి. తమిళ, తెలుగు భాషలకు జి.వి ప్రకాష్ సంగీత దర్శకుడు. వాసన్ విసువల్ వెంచర్స్ బ్యానర్ పై కె ఎస్ శ్రీనివాసన్ నిర్మాత