కొన్ని దశాబ్దాలుగా సంగీత ప్రియుల్ని అలరిస్తున్న లెజెండ్రీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా గుండెనొప్పి రావడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని వెంటనే దగ్గరలోని అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. ఈ వార్త తమిళ మీడియా ద్వారా బయటకి వచ్చింది. అలాగే ఇళయరాజా గారి అభిమానులంతా ఆయన వెంటనే కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇళయరాజాకి ఎలాంటి ప్రమాదం లేదని అంటున్నారు.
తమిళ మీడియా ఇళయరాజా గారు మరో రెండు మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని చెబుతోంది. ప్రస్తుతం ఇళయరాజా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. 1976 నుంచి ఎన్నో వందల సినిమాలకు సంగీతం అందించిన మాస్ట్రో ఇళయరాజా గారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం..