మొదలైన బాహుబలి భారీ వార్ సీక్వెన్స్

Bahubali
సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో అత్యంత భారీగా ఉండే ఓ వార్ సీక్వెన్స్ ని చిత్రీకరించనున్నారని ఇది వరకే తెలియజేశాం. గత కొద్ది రోజులుగా ప్రాక్టీస్ సెషన్ జరుగుతున్న ఈ వార్ సీక్వెన్స్ షూటింగ్ ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఈ వార్ సీక్వెన్స్ లో భాగంగా 2000కి మందిపైగా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ వార్ ఎపిసోడ్ సినిమాకె హైలైట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. అలాగే సత్య రాజ్, రమ్య కృష్ణ, నాజర్, అడవి శేష్ మొదలైన వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టాలీవుడ్ లో ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ‘బాహుబలి’ సినిమా రెండు పార్ట్స్ గా 2015 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version