అందాల భామ సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇటీవలే వివి వినాయక్ సినిమా కోసం జపాన్ లో షూటింగ్ పూర్తీ చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చిన సమంత ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ లో పాల్గొంటోంది.
సమంత త్వరలో తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్న ఓ సినిమా సెట్స్ లో అడుగుపెట్టడానికి సర్వం సిద్దం చేసుకుంటోంది. లింగు స్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. గత వారంలో సూర్య ఇంట్రడక్షన్ సాంగ్ ని ఓ భారీ సెట్ వేసి షూట్ చేసారు. ఈ సినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. మరో కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ లో సమంత పాల్గొననుంది. దీనికోసం సమంత 10 రోజులు ముంబై లో ఉండనుంది.