అందాల భామ శృతి హాసన్ ప్రస్తుతం వరుస ఆఫర్లు దక్కించుకోవడంలో ముందజలో ఉంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ గా టాప్ సెలబ్రిటీల లిస్టులో శృతి కూడా చేరిపోయింది. ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో ఫిలిప్స్ ఎల్ఈడి లైట్స్ మరియు బిగ్ సి కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసింది.
శృతి తాజాగా సిసిఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్) కి న్యూ బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసింది. గత సంవత్సరం శృతి చెన్నై రైనోస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఇప్పుడు టోటల్ సిసిఎల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది. ఈ విషయం తెలిసిన ఈ భామ ఎంతో థ్రిల్ అవ్వడమే కాకుండా కర్టన్ రైజర్ ఈవెంట్ లో సచిన్ టెండూల్కర్ కాకుండా ఇండియన్ సినిమాలోని టాప్ సెలబ్రిటీల లిస్టు లో చేరిపోయింది.
శృతి హాసన్ ప్రస్తుతం దుబాయ్ లో వెల్ కమ్ బ్యాక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. శృతి త్వరలోనే ‘ఎవడు’, రేస్ గుర్రం సినిమాల్లో కనిపించనుంది. 2014లో తమిళ సినిమాలు కూడా చేయడానికి శృతి ప్లాన్ చేసుకుంటోంది.