డిసెంబర్ 28న జండాపై కపిరాజు ఆడియో

Jenda-pai-kapiraju
నాని మరియు అమలాపాల్ జంటగా నటిస్తున్న జండాపై కపిరాజు సినిమా ఆడియో ఈ నెల చివరివారంలో విడుదలకానుంది. ఈ సినిమాకు సముధ్రఖని దర్శకుడు. ఈ చిత్రాన్ని తమిళ మరియు తెలుగు భాషలలో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్ ఆడియో డిసెంబర్ 11న విడుదలచేసారు, ఇప్పుడు తెలుగు వెర్షన్ యొక్క ఆడియోను ఈ నెల 28న శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు

ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చెయ్యనున్నాడు. అందులో తమిళియన్ పేరు మాయ కణ్ణన్. ఈ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇధి ప్రతినాయక ఛాయలున్న పాత్ర. శంభో శివ శంభో సినిమా తరువాత ఈ దర్శకుడు మనముందుకు రానున్నాడు. ఈ సినిమాలో రాగిణి ద్వివేది ముఖ్యపాత్రధారి

ఈ సినిమాను వాసన్ విసువల్ వెంచర్స్ బ్యానర్ పై కె.ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు.జి.వి ప్రకాష్ సంగీత దర్శకుడు

Exit mobile version