అందాల నటి తమన్నా ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమాలో నటించనుంది. ఈ సినిమాలో ప్రభాస్ డబల్ రోల్ చేయనున్నాడు. బాహుబలి లో యంగ్ ప్రభాస్ శివుడు నటిస్తున్నాడు. ఈ పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కు జంటగా తమన్నా నటిస్తోంది. బాహుబలి కి అనుష్క జంటగా నటిస్తోంది. ఈ విషయం తమన్నా ఫ్యాన్ కి చాలా ఆనందం కలిగిస్తుంది. ప్రస్తుతం నిర్వాహకులు ఈ సినిమా పలు యుద్ద సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్రీకరిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఆర్క మీడియా నిర్మిస్తోంది.