చిరంజీవి మూవీ రీమేక్ లో నటించడం లేదన్న అమీర్ ఖాన్

ameer_khan
గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రుద్రవీణ’ సినిమా రీమేక్లో లో అమీర్ ఖాన్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్ర డైరెక్టర్ కె. బాల చందర్ ని అమీర్ ఖాన్ కలవడం వల్ల ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఆ వార్తలపై అమీర్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవలే ఇదే విషయాన్ని చెన్నై మీడియా అమీర్ ఖాన్ ని అడిగితే ‘ హిందీలో రుద్రవీణ రీమేక్ చెయ్యాలని ఎలాంటి ప్లాన్ లేదు. అసలు ఈ వార్తలు ఎలా వస్తున్నాయో నాకు తెలియడం లేదని’ అమీర్ సమాధానం ఇచ్చాడు. అసలు విషయం ఏమిటంటే తారే జమీన్ పర్ సినిమా తీసినందుకు గాను బెస్ట్ తొలి డైరెక్టర్ గా గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు గెలుచుకున్నప్పుడు అమీర్ ఖాన్ కె. బాలచందర్ ని కలిసాడు. అప్పుడు బాలచందర్ గారు ప్రసంగించిన స్పీచ్ తో ఎంతో థ్రిల్ కి లోనైన అమీర్ ఖాన్ ఆ స్పీచ్ కాపీని తన దగ్గర పెట్టుకున్నాడు. అది తన జీవితంలో మరచిపోలేని ఓ సంఘటన అని అమీర్ ఖాన్ అన్నాడు.

అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన ధూమ్ 3 సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఆదిత్య చోప్రా నిర్మించాడు.

Exit mobile version