అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా సెన్సార్ పనులు పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. విడుదలతేదిని ని అధికారికంగా ప్రకటించనున్నారు
స్వరవాణి కీరవాణి గారు సమకూర్చిన ఈ సినిమా ఆడియో ఇటీవలే బ్యాంకాక్ లో విడుదలచేశారు. సుమంత్ సరసన థాయ్ నటి పింకీ సావిక నటిస్తుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చంద్ర సిద్ధార్ధ్ తెరకెక్కిస్తున్నాడు. కాంచి స్క్ర్రిప్ట్ ను అందించాడు. పూదోట సుదీర్ నిర్మాత
ఎస్.ఎస్ కాంచి హాస్యాన్ని సమపాళ్ళలో స్క్రిప్ట్ లోకి జోడించగల నిపుణుడు. కధపై పట్టు ఉన్నవాడు. మరి సుమంత్ కు ఏలండి కధను ఇచ్చాడో చూడాలి