ఎట్టకేలకు విడుదల కానున్న ‘రేయ్’ టీజర్

Rey
చాలా నెలల గ్యాప్ తర్వాత వైవిఎస్ చౌదరి ఎట్టకేలకు తన రాబోయే సినిమా ‘రేయ్’ కి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో ఫస్ట్ టీజర్ ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా ద్వారా చిరంజీవి మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. వైవిఎస్ చౌదరి ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ లోని డాన్స్, యాక్టింగ్ స్కిల్స్ ని పూర్తిగా ఆవిష్కరించనున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

కరేబియన్ ఐ ల్యాండ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే మ్యూజికల్ లవ్ స్టొరీ ‘రేయ్’. ఈ మూవీలో ప్రొఫెషనల్ డాన్సర్ అయిన సాయి ధరమ్ తేజ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాంపిటీషన్ కి వెళ్ళే కుర్రాడి పాత్రలో కనిపిస్తాడు.

సయామీ ఖేర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రద్ధ దాస్ సెకండ్ హీరోయిన్ మరియు మెక్సికన్ పాప్ సింగర్ గా కనిపించనుంది. ఈ సినిమా క్లైమాక్స్ సాంగ్ కోసం వైవిఎస్ చౌదరి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. చక్రి సంగీతమా న్దించిన ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version