బిరియాని సక్సెస్ పై నమ్మకంగా ఉన్న కార్తి

Biriyani-Telugu-First-Look-

తమిళ హీరో కార్తి నటించిన ‘బిరియాని’ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హన్సిక, మండి తఖర్, ప్రేంజీ అమరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కార్తి నటించిన గత సినిమాలు శకుని, బాడ్ బాయ్ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడ్డాయి, కానీ బిరియాని టీం మాత్రం ఈ సినిమా బాగా వచ్చిందని ఎంతో నమ్మకంగా ఉన్నారు.

ఇటీవలే నిర్మాత కెఈ జ్ఞానవేల్ రాజ, అతని టీం ఈ సినిమా ఫైనల్ వెర్షన్ ని చూసారు. వాళ్ళు ఎంతో థ్రిల్ అయిన సినిమా సక్సెస్ అవుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. అలాగే మంచి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అందించినందుకు వెంకట్ ప్రభుని తెగ పొగిడేస్తున్నారు. ఈ సినిమాలో కార్తి ప్లే బాయ్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే కార్తికి బిరియాని అంటే ఇష్టం అలా ఓ రోజు రాత్రి బిరియాని కోసం జర్నీ సారాంశమే ఈ సినిమా. ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం కార్తీ ఓ పాటని కూడా పాడాడు. అలాగే యువన్ శంకర్ రాజ మ్యూజిక్ అందించిన 100వ సినిమా ‘బిరియాని’.

Exit mobile version