రేపే రవితేజ కొత్త సినిమాకి శ్రీకారం

raviteja

మాస్ మహారాజ రవితేజ 2013లో ‘బలుపు’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా విజయం తర్వాత ఇప్పటికీ రవితేజ తన మరో సినిమాని మొదలు పెట్టలేదు. కొద్ది రోజుల క్రితం వైవిఎస్ చౌదరి ఓ సినిమాని అనౌన్స్ చేసారు కానీ ఆ తర్వాత ఆ సినిమా కార్య రూపం దాల్చలేదు. ప్రస్తుతం అదే సినిమాని కన్నడలో ప్రముఖ నిర్మాత అయిన రాక్ లైన్ వెంకటేష్ నిర్మించనున్నాడు.

ఈ సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమాలు రేపు ఉదయం అనగా డిసెంబర్ 11న ఉదయం 9 గంటలకు ఫిల్మ్ నగర్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ‘బలుపు’ సినిమాకి కథని అందించిన బాబీ ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. ఈ సందర్భంగా రవితేజకి గుడ్ లక్ చెబుతున్నాం..

Exit mobile version