సుబ్బారావు ఏకైక లక్యం పెళ్లి – కిరీటి

Subbarao
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటున్న కిరీటి దామరాజుకి షార్ట్ ఫిల్మ్ సర్క్యూట్ లో మంచి పేరుంది. త్వరలోనే కిరీటి తను నటించిన మొదటి సినిమా ‘సెకండ్ హ్యాండ్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో కిరీటి ఒక డెంటిస్ట్ గా కనిపించనున్నాడు. ఆ పాత్ర పేరు సుబ్బారావు.

‘సుబ్బారావు బాగా నిరాశ కలిగిన ఒక డెంటిస్ట్. అలాగే అతినికి జీవితంలో ఉన్న ఏకైక లక్ష్యం పెళ్లి. ఈ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. అలాగే ఆ పాత్రని డైరెక్టర్ కిషోర్ తిరుమల బాగా తీర్చిదిద్దాడని’ కిరీటి అన్నాడు. ఈ యంగ్ యాక్టర్ ‘సెకండ్ హ్యాండ్’ సినిమాపై ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ ఇతని కెరీర్ కి మంచి బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నాడు.

‘కిరీటి సెకండ్ హ్యాండ్ సినిమాలో కాకుండా త్వరలో రిలీజ్ కానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో కూడా కనిపించనున్నాడు.

Exit mobile version