చాలా రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పివిపి కాంబినేషన్లో ఓ సినిమా రానుందని తెలియజేశాం. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సినిమా షూట్ కంప్లీట్ చేసాక ఈ కొత్త సినిమా 2014 మధ్యలో మొదలు కానుంది. ఒక సమయంలో పివిపి సినిమాని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తాడనే వార్తలు వినిపించాయి కానీ అవి అధికారికంగా ఎలాంటి కార్యరూపం దాల్చలేదు.
శ్రీ కాంత్ అడ్డాల తర్వాత పలు డైరెక్టర్స్ పేర్లు కూడా వినిపించాయి. ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు. వారిని వచ్చే సంవత్సరం మొదట్లో ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.