భారీ విజయం కోసం ప్రయత్నం చేస్తున్న హరీష్ శంకర్

Harish-Shankar1
చివరిగా హరీష్ శంకర్ తన రీసెంట్ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ ఓటమి నుండి బయట పడ్డాడా? చూస్తుంటే పడ్డడనే అనిపిస్తోంది. ఎన్ టి ఆర్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్టోబర్ లో విడుదలైంది. ఈ సినిమా తను గతంలో తీసిన సినిమా ‘గబ్బర్ సింగ్ అంత విజయాన్ని నమోదు చేయలేక పోయింది. దీనితో ఈ సినిమా విడుదల తరువుత అతను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని సాదించకపోవడంతో తనే ఈ పరాజయానికి కారణమని అంగీకరిస్తూ దీనికి ఎవరిని భాద్యున్ని చేయలేనని అన్నాడు.

ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూ లో హరీష్ మాట్లాడుతూ ‘సినిమా ఫెయిల్ అయితే ఆ అపజయాన్ని పక్కవారి మీదికి తోయడం నాకు ఇష్టం ఉండదు’ అని అన్నాడు.స్పష్టంగా ఆయన తీసిన మూడు సినిమాలలో రెండు సినిమాలు మాస్ ఎంటర్టైనర్ గా తెరకేక్కయి. అయితే మూడవ సినిమాని తక్కువ బడ్జెట్ లో తీయాలని అనుకున్నాడు. కానీ హరీష్ శంకర్ కన్ఫ్యూజ్ అయి తను ఒక మంచి బ్రేక్ కోసం ఒక కమర్షియల్ పేరు పెట్టని ఒక సినిమా ప్రారంభించాడు.

రామయ్యా వస్తావయ్యా విడుదల తరువాత తన తరువాత సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. తను తరువాత తియోబోయే సినిమా తన స్వభావానికి తగినట్టుగా ఉండటానికి స్క్రిప్ట్ తో ఫైట్ చేస్తున్నాడు. మళ్ళి స్ట్రాంగ్, అందరిని ఆశ్చర్యపరిచే విదంగా సినిమా తీయడానికి సిద్దమవుతున్నాడు. తను తీసిన మొదటి సినిమా షాక్ ఫెయిల్ అయిన తరువుత తను ‘మిరపకాయ’తో మంచి విజయాన్ని సాదించాడు. మళ్ళి ఇప్పుడు కూడా అదే విదంగా మరో మంచి సినిమాతో విజయాన్ని సాదిచాలని ఆశిద్దాం.

Exit mobile version