‘ఉలవచారు బిర్యని’ పై సంతోషంగా వున్న ప్రకాష్ రాజ్

Prakash-Raj​​
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ‘ఉలవచారు బిర్యాని’ సినిమా షెడ్యూల్ ముగిసింది. ఈ మధ్య ఈ సినిమా రెండవ షెడ్యూ ల్ షూటింగ్ మైసూర్ లోనిర్వహించడం జరిగింది. ఈ షెడ్యూల్ లో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగా వచ్చిందని తను చాలా త్రిల్ గా ఫీల్ అయినట్టు తెలియజేశాడు. ఈ ‘ఉలవచారు బిర్యానీ’ సినిమాలో ఫుడ్ మరియు ప్రేమ గురించి ఉంటుందని తెలిపారు. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో వివిధ రకాల వంటకాలు తయారు చేసినట్టు ఆయన అంగీకరించారు.

కొంత కాలం గ్యాప్ తరువాత డైరెక్టర్ ధోని దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాని మలయాళం సినిమా ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ కి రీమేక్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రెండు జంటలు మధ్య ప్రేమకథ వారి మధ్య ఆహరంలో ఉండే వ్యత్యాసలను చాలా ఆసక్తికరంగా చాలా సింపుల్ థీమ్ తో తీయడం జరిగింది. ఈ సినిమాలో నటించిన నటీనటుల తేజ్, సంయుక్త లుకొత్తవారు అయినప్పటికి చాలా బాగా నీట్ గా, చక్కగా నటించారని అన్నాడు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి ప్రీత సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదలయ్యే అవకాశం ఉంది.

Exit mobile version