బయటపడిన సుధీర్ బాబు రహస్య కోరిక

Sudheer_Babu-(10)
ఇటివలే విజయమంతమైన ‘ప్రేమ కధ చిత్రం ‘ వల్ల సుధీర్ బాబు కెరీర్ దూసుకుపోతుంది . తాజా గ విడుదలైన ‘ఆడు మాగాడు రా బుజ్జి ‘ ఈరోజే విడుదలైంది. ఈ చిత్రం లో సుధీర్ బాబు నటనకి మంచి స్పందన లభిస్తుంది . సుధీర బాబు తన దేహ ధారుడ్యం పై డాన్సుల పై పెట్టిన శ్రమ అతని అన్ని చిత్రాల్లో కనపడింది.

ఇటివలే జరిగిన ఒక మీడియా సమావేశం లో తనకు బాడ్మింటన్ ఆటగాడు మరియు కోచ్ అయిన పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారం గా ఒక చిత్రం తీయలనుంది అని ప్రకటించారు. గోపీచంద్ తో తనకున్న అనుభందాన్ని గురించి వివరిస్తూ ” సినిమా పరిశ్రమ లోకి వచ్చే ముందు నేను బాడ్మింటన్ జాతీయ స్థాయిలో ఆడేవాడిని , కొన్ని సార్లు గోపీచంద్ తో కూడా ఆడాను . బాడ్మింటన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు అవకాశం దొరికితే, పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారం గా ఒక చిత్రాన్ని నిర్మిస్తా. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న.”

సుధీర బాబు ప్రస్తుతం ‘మాయదారి మల్లిగాడు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది .

Exit mobile version