ముని3 లో ప్రత్యేక పాత్ర పోషించనున్న నిత్యామీనన్ !

nithya-and-lawrence
రాబోతున్న రాఘవ లారెన్స్ ముని3 సినిమా లో ప్రత్యేక పాత్రకు నిత్యామీనన్ ను ఎన్నుకున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా లో నిత్యామీనన్ గంగ పాత్రలో కనిపించనుంది. అలాగే నిత్యా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కపిపిస్తుందని తమిళ సినీవర్గాలు ఇప్పటికే చెప్పుకుంటున్నాయి. గంగ పాత్రకు ఎవరిని ఎన్నుకోవాలని అనుకున్న లారెన్స్, చివరకు నిత్యామీనన్ చేత నటింపజేయాలని మొండిగా ఉన్నాడట. లారెన్స్ హీరో గా నటిస్తున్న ఈ కామెడీహర్రర్ చిత్రంలో తాప్సీ కూడా కీలక పాత్రను పోషించనుంది. ఈ చిత్రం లోని పాటల రిహార్సల్ కు సంబందించి రాఘవ లారెన్స్ ప్రస్తుతం షూటింగ్ ను నిలిపివేశారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం అంతా సక్రమంగా జరిగితే వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తాప్సీ రన్నింగ్ షాదీడాట్ కాం అనే హిందీ చిత్రం లో నటిస్తుంది. ముని3 చిత్రానికి సంబంధించిన తరువాతి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.

Exit mobile version