అమీ జాక్సన్ ను ప్రశంసించిన పీ.సి శ్రీరామ్

amy-jackson

భారతదేశంలో అత్యున్నత్త సినిమాటోగ్రాఫర్లలో పీ.సి శ్రీరామ్ ఒకరు. సినిమా ప్రేక్షకులకు ఆయనది పరిచయం అవసరంలేని పేరు. ‘గీతాంజలి’, ‘నాయకుడు’, ‘సఖి’, ‘ఖుషి’, ‘ఇష్క్’ వంటి సినిమాలు ఆయన ప్రతిభకు తార్కాణాలు. ప్రస్తుతం శంకర్ తీస్తున్న ‘మనోహరుడు’కు తన కెమెరా కళ్ళను అరువివ్వనున్నాడు.

మమోలుగా పీ.సి శ్రీరామ్ తనని ఎంతగానో స్పందింపజేస్తేకానీ ఎవ్వరినీ మెచ్చుకోడు. ప్రస్తుతం ‘మనోహరుడు’ లో హీరోయిన్ గా నటిస్తున్న అమీ జాక్సన్ తాయనకు నచ్చిందట. ఆమె ఫోటోను పోస్ట్ చేస్తూ ‘అందానికి అత్యున్నత స్థానం’ అని తెలిపాడు. గతంలో ఈ భామ ‘మదరాసిపట్టణం’, ‘శివతాండవం’ మరియు గౌతమ్ మీనన్ ‘ఏక్ హసీనా తీ’ సినిమాలలో నటించింది. ‘మనోహరుడు’ ఆమె కెరీర్ లో పెద్ధ సినిమా.

ఈ సినిమా 2014 వేసవిలో విడుదలచెయ్యనున్నారు. విక్రమ్ హీరో. ఈ సినిమానే తమిళంలో ‘ఐ’గా తెరకెక్కిస్తున్నారు. అమీ జాక్సన్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’లో కనిపించనుంది.

Exit mobile version