హైదరాబాద్ లో మరో సరికొత్త స్టైలిష్ మల్టీ ప్లెక్స్ ఓపెన్ కావడానికి సిద్దంగా ఉంది. కూకట్ పల్లి జె.ఎన్.టి.యూ దగ్గరలోని మంజీరా మాల్ దగ్గర సినీపోలిస్ అనే ఈ మల్టీ ప్లెక్స్ ని డిసెంబర్ 4న ప్రారంభించనున్నారు. ఈ మల్టీప్లెక్స్ లో అధికారికంగా మొదటి ప్రీమియర్ ఈ రోజు రాత్రి వేయనున్నారు.
ఈ మల్టీ ప్లెక్స్ పనులు చాలా కాలం క్రితమే పూర్తయ్యాయి. కానీ దీనికి పర్మిషన్స్ రాని కారణంగా ఇన్ని రోజులు ఆలస్యమైంది. ఈ సరికొత్త మల్టీ ప్లెక్స్ లో ఆర్ట్ ఆడియో విజువల్ ఎక్విప్ మెంట్ కూడా ఉంది. కూకట్ పల్లి మరియు హైటెక్ సిటీలో ఉండే వారికి ఈ మల్టీ ప్లెక్స్ బాగా ఉపయోగపడుతుంది.
సినీపోలిస్ అనేది ఒక ఇంటర్నేషనల్ మూవీ థియేటర్ చైన్ సిస్టం. ఇప్పటికే ఇండియాలోని పలు పెద్ద నగరాలైన బెంగుళూరు, ముంబై, పూణే, అమ్రిత్సర్, అహ్మదాబాద్ మొదలైన ప్రదేశాలలో ఈ మల్టీ ప్లెక్స్ బాగా ఫేమస్.