భాగ్యనగరంలో సందడి చేస్తున్న ఆగడు టీం

Mahesh_Babu_Latest_Pics
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఆగడు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు, వెన్నెల కిశోర్, ఎంఎస్ నారాయణ తదితరులపై కొన్ని హాస్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. దూకుడు సినిమాలో మహేష్ ని పోలీస్ ఆఫీసర్ గా చూపించిన శ్రీనువైట్ల ఈ సినిమాలో మహేష్ బాబుని మాస్ పోలీస్ ఆఫీసర్ గా చూపించానున్నాడు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు రాయలసీమ యాసలో మాట్లాడి ప్రేక్షకులని థ్రిల్ చేయనున్నాడు.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తొలిసారి మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version