పిజ్జా నిర్మాతతో పనిచెయ్యనున్న సిద్దార్ధ్

Siddharth-9

‘లుసియా’ అనే సినిమా తెలుగు, తమిళ అనువాదంలో సిద్దార్ధ్ నటించనున్నాడు. ఈ సినిమా కన్నడ మాతృకలో మొదటిసారిగా కన్నడ ప్రేక్షకుల డబ్బుతో తెరకెక్కించాడు దర్శకుడు పవన్ కుమార్. ఈ సినిమా కన్నడలో విజయం సాధించి కొన్ని చిత్రోత్సవాలలో ప్రదర్శితం అయ్యింది. ఇటీవలే ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమా హిందీ హక్కులను సొంతం చేసుకుంది.

తమిళ చిత్ర ఆగ్ర నిర్మాతలలో ఒకరైన సి.వి కుమార్ ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు, తమిళ హక్కులను సొంతం చేసుకున్నాడు. ఈయన గతంలో పిజ్జా, పిజ్జా 2(విల్లా) సినిమాలను తీశాడు. సిద్ధార్థ్ కు ఈయనతో పనిచేయడం చాలా నచ్చేసిందట. అంతే కాక తమిళంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న వారితో జతకట్టబోతున్నాను మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరాడు.

అంతే కాక ఈ లూసియా సినిమా తీసిన పవన్ కుమార్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. “నా పొగడ్తలన్నీ దర్శకుడికే చెండాలి. ఆయన కష్టాన్ని ఒమ్ముచెయ్యమని అనుకుంటున్నాం”. సిద్ధార్ధ్ మొదటిసారిగా ఒక రీమేక్ ను తమిళ మరియు తెలుగు భాషలలొ నటించడానికి సంతకం చేశాడు. ఈ రీమేక్ కు ప్రసాద్ రామార్ దర్శకుడు. సంతోష్ నారాయణ్ సంగీతదర్శకుడు. జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

Exit mobile version