‘బాణం’ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నారా రోహిత్ తన నటన, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. తన కెరీర్లో మొదటి సారి తన స్టైల్ ని పూర్తి గా మార్చుకొని ‘రౌడీ ఫెలో’ గా మనముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం నారా రోహిత్ బరువు తగ్గాడు అలాగే హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాడు.
సాహిత్య రచయితగా మంచి పేరు తెచ్చుకున్న చైతన్య ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని పోస్టర్స్ చూసిన వారు నారా రోహిత్ లుక్ చూసి ఆశ్చర్యపోయారు. త్వరలోనే ఈ పోస్టర్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. విశాఖ సింగ్, నందిని రాయ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా కనిపించనున్నాడు. సినిమా 5 – మూవీ మిల్స్ బ్యానర్స్ వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సన్నీ మ్యూజిక్ డైరెక్టర్.