జనవరి నుండి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల చిత్రం.?

allu-arjun-and-trivikram

‘అత్తారింటికి దారేది’ సినిమా ఘన విజయంతో ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా చరిత్ర సృష్టించిన దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమా విజయం తరువాత తన తదుపరి చిత్రంపై చాలా అంచనాలు వున్నాయి. కానీ మన మాటల మాంత్రికుడు మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్ పై ఒక మాట కూడా మాట్లాడట్లేదు.

కొన్ని కధనాల ప్రకారం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తన తదుపరి చిత్రం చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి మొదలుకానుందట. ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ‘జులాయి’ సినిమా కమర్షియల్ గా విజయం సాధించింది. ఈ సినిమా పై మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతాం

Exit mobile version