డిసెంబర్ లో విడుదలకానున్న సంపూర్ణేష్ సినిమా

Sampoornesh Babu
2013లో ఇంటర్నెట్ ద్వారా ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యక్తుల జాబితాలో మన సంపూర్ణేష్ బాబు పేరు తప్పకుండా వుంటుంది. ‘హృదయ కాలేయం’ సినిమా ద్వారా బర్నింగ్ స్టార్ అన్న పేరును తెచ్చుకుని తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు

పోలీసుల వేటలో దొరకాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న పాత్రలో సంపూ ను దర్శకుడు స్టీవన్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. జూన్ లో మొదటి టీజర్ విడుదలైనా ఆ తరువాత ఈ సినిమాపై వార్తాలేమీ పెద్దగా రాలేదు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేశారని తెలిపాడు

ఇప్పుడు మన హీరో ఈ సినిమా రెండో ట్రెయిలర్ డిసెంబర్ 2న విదూయాల చేయనున్నారు. ఆడియోను కూడా ఇదే వారంలో భారీ రీతిలో విడుదల చేస్తారు. ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో మనముందుకు రానుంది

Exit mobile version