ఆ క్షణాల్ని మిస్ కాకూడదంటున్న అనుష్క

anushka-varna-movie
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా క్రేజ్ మరియు అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బాగా బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ యోగా బ్యూటీ అనుష్క. మామూలుగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న హీరోయిన్స్ తమకు అసలు కాస్త కూడా ఖాళీ టైం దొరకడం లేదని, అసలు ఫ్యామిలీ మెంబర్స్ ని, ఫ్రెండ్స్ ని కలవలేకపోతున్నామని అంటుంటారు. కానీ వీరందరికీ భిన్నంగా అనుష్క మాత్రం నా దగ్గర వాటికి సమయం ఉందని చెబుతోంది.

‘సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నా కుటుంబ సభ్యుల కోసం సమయం ఎలా కేటాయించాలో నాకు తెలుసు. సినిమా, కుటుంబం అనేవి రెండు వేరువేరు. దేనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి. అలాగే నాకు కాస్త ఫ్రీ టైం దొరికితే ఎక్కడ ఉన్నా బెంగుళూరులో వాలిపోతా.. ఇంట్లో ఉన్నంత సేపూ సినిమాల గిరించి ఆలోచించను. ఇంటి పట్టునే ఉంటాను. ఇంట్లో ఉండే ప్రతిక్షణం అమోల్యమైనదే. అందుకే ఉన్న సమయంలోనే అన్ని అనుభూతుల్ని ఆస్వాదించాలి. సినిమాలే కాదు మన ఇష్టాలు, స్నేహితులు కూడా ముఖ్యమే. నా దగ్గర వాటికి కూడా సమయం ఉందని’ అంటోంది అనుష్క.

అనుష్క ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’, గుణశేఖర్ దర్శకత్వంలో ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తోంది.

Exit mobile version