నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో శరవేగంగా జరుగుతోంది. నిన్న ఈ సినిమా షూటింగ్ మర్రిపాలెం ఏరియాలో జరిగింది. ఇప్పటికే కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలను పోర్ట్ ఏరియాలో చిత్రీకరించారు.
బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలనచిత్రం వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్ర నిర్మాతలు ఎక్కడ రాజీపడకుండా సినిమా పెద్ద హిట్ అయ్యేలా కృషి చేస్తున్నారు. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.