తన అందమైన స్వరంతో అంతకంటే అందమైన చూపులతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన నటీమణి మమతా మొహందాస్. ఈ కేరళ కుట్టి తన కెరీర్ మొదట్లో బోల్డన్ని మంచి పాత్రలను పోషించింది.
అయితే క్యాన్సర్ మరియు వివాహ జీవితం ఈమె కెరీర్ లో అనూహ్య మార్పులను సంతరించుకున్నాయి. ఒకానొక సమయంలో పూర్తిగా తగ్గిపోయిన ఈ మహమ్మారి మళ్లీ తిరగబెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చెన్నైలో తీసుకుంటుంది
ఆమె ఒక పత్రికకు ఇంటర్వ్యూ లో “క్యాన్సర్ నన్ను దృడం గా తయారుచేసింది. అయతే ఈ జబ్బు మరోసారి వచ్చింది అన్న వార్త నన్ను నిరుత్సాహానికి గురిచేసింది. అయితే ఇప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి నేను మానసికంగా సిద్ధపడుతున్నాను” అని తెలిపింది. మమతా త్వరలో కొన్ని రియలిస్టిక్ మళయాళ సినిమాలలో నటించనుంది