హీరో నానిని పేస్ బుక్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఒక లక్షకు చేరింది. దీనితో తను కూడా పేస్ బుక్ లో లక్షమంది ఫాలోవర్స్ ఉన్న తెలుగు సినిమా ప్రముఖులలో ఒకరిగా చేరిపోయాడు. ఈ విషయం విని నాని చాలా ఆశ్చర్యానికి గురైయ్యాడు. దీనిపై నాని మాట్లాడుతూ “ఇన్ని సంవత్సరాలుగా అభిమానులు, నా ప్యాన్స్ నా మీద చూపిస్తున్న అభిమానానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే సాదారణంగా ఎవరైనా నటుడు ఒక సంవత్సరం పాటు సినిమాలు తియకపోతే అతన్ని మరిచిపోతారు. అలాగే నా సినిమా వచ్చి సంవత్సరం అయ్యింది. కానీ అబిమానులు నన్ను గుర్తు పెట్టుకున్నారు. వారికీ నా కృతజ్ఞతలు. నేను వారికి మాటిస్తున్నాను మరోసారి ఈ విదంగా లేటు కాకుండా చూసుకుంటానని’ అన్నాడు. ప్రస్తుతం నాని నటించిన ‘పైసా’ సినిమా ఈ నెల చివరిన విడుదలకానుంది. అలాగే మరో సినిమా ‘జెండాపై కపిరాజు’ షూటింగ్ కూడా దాదాపు పూర్తైయ్యింది.