యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ నటించిన సినిమాలు ఈ మధ్య బాక్స్ ఆఫీసు వద్ద ఆశించినంత విజయాన్ని సాధించలేకపోతున్నాయి. తన గతంలో తీసిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ ల వర్షం కురిపించాయి. కానీ ఈ మధ్య ఆయన నటించిన కమర్షియల్ మూవీ కూడా బాక్స్ ఆఫీసు వద్ద నిరాశపరించింది. దీనితో ఎన్ టి ఆర్ తను తీయబోవు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. అంతే కాకుండా డైరెక్టర్ లను కూడా గుడ్డిగా నమ్మడం లేదని తెలిసింది. ఒక సారి స్క్రిప్ట్ ఒకే చిప్పిన తరువుత ఎన్ టి ఆర్ షూటింగ్ మధ్యలో ఎటువంటి జ్యోక్యం చేసుకోరు. అలాంటిది ఈ మధ్య ఒక డైరెక్టర్ తో అది బాగోలేదు నాకు నచ్చలేదు అంటూన్నడని తెలిసింది. అయితే ఇదంతా ఆయన ఒక హిట్ కొట్టడానికి చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. చూద్దాం అతని ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తుందో.