విశాఖపట్నంలో బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమా షూటింగ్

legend

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ సినిమా ‘లెజెండ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ రామకృష్ణ బీచ్ మరియు అక్కడి పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఇక్కడ బాలకృష్ణపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షూటింగ్ లో బాలకృష్ణతో పాటు మరి కొంత మంది ముఖ్యమైన నటులు కూడా పాల్గొంటున్నారని సమాచారం. మాకందిన సమాచారం ప్రకారం అక్కడ కొన్ని గుర్రపు స్వారి సన్నివేశాలు చిత్రీకరించారు. రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించనున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2014లో విదుదలైయ్యే అవకాశం ఉంది. ఈ భారీ బడ్జెట్ సినిమాని 14రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలన చిత్ర బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

Exit mobile version