ఫేస్ బుక్ లో సంచలనం సృష్టిస్తున్న ప్రభాస్

Prabhas
నిన్న ఫేస్ బుక్ లో అఫిషియల్ గా పేజ్ ని పోరారంభించిన ప్రభాస్ ఒక్కరోజులో 70,000 లైక్ లను సొంతం చేసుకుంది. ఈ పేజ్ ద్వారా ప్రభాస్ తన అభిమానులతో ముచ్చటించనున్నాడు

కొన్ని రోజుల్లో ప్రభాస్ ట్విటర్ లో సైతం జాయిన్ అవ్వనున్నాడు. ‘మిర్చి’ తరువాత ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. ప్రభాస్ ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ సినిమా నిర్మాణంలో వున్నారు. ఇది కనీసం మరో యేడాదిన్నర షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సినిమాలో ప్రభాస్ యోధునిగా భారీ కాయంతో కనబడనున్నాడు. ఈ బుధవారం ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ‘బాహుబలి’ బృందం ఒక ప్రత్యేక వీడియో ను విడుదల చెయ్యనున్నారు

Exit mobile version