‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో వరుస విజయాలు అందుకొని ఫుల్ జోష్ మీదున్న నితిన్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘హార్ట్ అటాక్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో శరవేగంగా జరుగుతోంది. కొద్ది సేపటి క్రితమే పూరి జగన్నాథ్ ‘ హార్ట్ అటాక్ మూవీ ఒక లవ్ స్టొరీ అని, సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నామని’ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
ఈ చిత్ర నవంబర్ మొదటి వారం కల్లా స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని తిరిగి ఇండియాకి రానున్నారు. దాంతో ఈ సినిమాకి సంబందించిన మేజర్ పార్ట్ పూర్తవుతుంది. నితిన్ సరసన ఆద శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. నితిన్ చాలా స్టైలిష్ గా కనిపించనున్న ఈ సినిమాని పోరి జగన్నాథ్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు.